జిల్లాల వారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా..

జిల్లాల వారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా..

మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. పెద్దగా మార్పులేమీ లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 7 మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టినట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చినట్లు చెప్పారు. ఇక కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుండి పోటీ చేయనున్నారు. 2023 ఎన్నికలకు ప్రకటించే అభ్యర్థుల్లో ఆరేడుగురు మాత్రమే సిట్టింగ్‌లను తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు. ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు. బోథ్, అసిఫాబాద్, హైదరాబాద్‌లోని ఉప్పల్, కోరుట్లలో మాత్రమే మార్పులు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు అంటే ఇతర పార్టీలకు రాజకీయమని విమర్శించారు. గుజరాత్, మహారాష్ట్రలను తలదన్ని తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తోంది దేశంలోనే తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కర్ణాటకలో తెలిసిపోయిందన్నారు. తెలంగాణలో మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసి ముందుకు సాగుతోందన్నారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్‌లో 29 సీట్లకు ఇరవై తొమ్మిది తామే గెలుస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 95 నుండి 105 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..

ఉమ్మడి ఆదిలాబాద్
మంచిర్యాల- నడివెల్లి దివాకర్ రావు
చెన్నూరు- బాల్క సుమన్
ఆదిలాబాద్ – జోగు రామన్న
బోథ్ – అనిల్ జాదవ్
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
నిర్మల్- ఇంద్రకరణ్ రెడ్డి
ముథోల్ -విఠల్ రెడ్డి
ఖానాపూర్- బూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్

ఉమ్మడి నిజామాబాద్
ఆర్మూర్- జీవన్ రెడ్డి
బోధన్- షకీల్
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్- గణేష్ బిగాలా
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్దన్
బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి
ఎల్లారెడ్డి- జాజుల సురేందర్
కామారెడ్డి- కేసీఆర్
జుక్కల్ -హనుమంత్ షిండే

కరీంనగర్
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్
కరీంనగర్- గంగుల కమలాకర్
సిరిసిల్ల- కేటీఆర్
మానుకొండూరు- రసమయి బాలకిషన్
రామగుండం- కోరుకంటి చందర్
కోరుట్ల- డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
హుస్నాబాద్- ఒడితల సతీష్
వేములవాడ- చల్మెడ లక్ష్మీకాంతరావు
హుజూరాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
జగిత్యాల – డాక్టర్ సంజయ్

మెదక్
సిద్దిపేట- హరీష్ రావు
దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్- కేసీఆర్
పఠాన్‌చెరు- గూడెం మహిపాల్ రెడ్డి
నారాయణఖేడ్ -ఎం భూపాల్ రెడ్డి
ఆందోల్ – క్రాంతి కిరణ్
మెదక్ – పద్మా దేవేందర్ రెడ్డి
నర్సాపూర్ – పెండింగ్

రంగారెడ్డి జిల్లా
మేడ్చల్- చామకూర మల్లారెడ్డి
మల్కాజ్‌గిరి- మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద
కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు
ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బీనగర్- దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
శేర్లింగంపల్లి- అరికెపూడి గాంధీ
వికారాబాద్- మెతుకు ఆనంద్
తాండూరు- పైలెట్ రోహిత్ రెడ్డి
ఉప్పల్ – బి. లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్ -ప్రకాశ్ గౌడ్పరిగి- కొప్పుల మహేష్ రెడ్డి

హైదరాబాద్
నాంపల్లి- పెండింగ్
గోషామహల్- పెడింగ్
ముషీరాబాద్- ముఠా గోపాల్
ఖైరతాబాద్- దానం నాగేందర్
జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్
సనత్ నగర్- తలసాని శ్రీనివాస్
సికింద్రాబాద్- పద్మారావు
యాకత్‌పురా- సామ సుందర్ రెడ్డి
చార్మినార్ – ఇబ్రహీం లోడి
బహదూర్ పుర- అలీ బక్రీ
చంద్రాయణగుట్ట -ఎం. సీతారం రెడ్డి
కంటోన్మెంట్ – లాస్య నందిత
కార్వాన్ – ఐందల కృష్ణయ్య
మలక్‌పేట – తీగల అజిత్ రెడ్డి

మహబూబ్‌నగర్
నారాయణ పేట -ఎస్. రాజేందర్ రెడ్డి
కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి
జడ్చర్ల- లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్- శ్రీనివాస్ గౌడ్
దేవరకద్ర- ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మక్తల్- చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి- నిరంజన్ రెడ్డి
నాగర్ కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి
గద్వాల- బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి
ఆలంపూర్ -బీఎస్ అబ్రహం
అచ్చంపేట- గువ్వల బాలరాజు
షాద్ నగర్ – అంజయ్య యాదవ్
కొల్హాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి

నల్గొండ
సూర్యాపేట- జగదీష్ రెడ్డి
నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
హుజూర్‌నగర్- శానంపూడి సైదిరెడ్డి
భువనగిరి- పైళ్ల శేఖర్ రెడ్డి
నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి- గాదరి కిషోర్
ఆలేరు- గొంగిడి సునీత
మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నాగార్జునసాగర్ – నోముల భగత్
దేవరకొండ- రవీంద్ర కుమార్
మిర్యాల గూడ- నల్లమోతు భాస్కర్ రావు

ఖమ్మం
పినపాక- రేగా కాంతారావు
కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు
అశ్వరావుపేట- మెచ్చా నాగేశ్వర్ రావు
భద్రాచలం- తెల్లం వెంకట్రావ్
ఇల్లందు- బానోతు హరిప్రియ నాయక్
ఖమ్మం- పువ్వాడ అజయ్
పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి
సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య
వైరా – బానోత్ మదన్ లాల్
మధిర – లింగాల కమల్ రాజ్

ఉమ్మడి వరంగల్
పాలకుర్తి -ఎర్రబెల్లి దయాకర్ రావు
నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల -చల్ల ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమ- దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ తూర్పు- నన్నుపునేని నరేందర్
స్టేషన్ ఘనపూర్- కడియం శ్రీహరి
జనగాం- పెడింగ్
వర్ధన్నపేట- ఆరూరి రమేష్
భూపాలపల్లి- గండ్ర వెంకట రమణారెడ్డి
మహబూబాబాద్ -బానోతు శంకర్

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *