రేవంత్ రెడ్డి ట్రాప్ లో కెసిఆర్ పడ్డాడా..?

రేవంత్ రెడ్డి ట్రాప్ లో కెసిఆర్ పడ్డాడా..?

సిట్టింగులకే సీట్లు కేటాయించాలన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ట్రాప్ లో కెసిఆర్ పడ్డాడా? లేక .. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం కెసిఆర్ వ్యూహమా? కెసిఆర్ వ్యూహంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చిక్కుకున్నాయా? ప్రత్యర్థులను అభ్యర్థుల వేటలో పడేసి కెసిఆర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడా? ప్రత్యర్థి అభ్యర్థి తెలిసిపోయింది కాబట్టి దీటైన అభ్యర్థిని నిలబెట్టడానికి కాంగ్రెస్ కు అవకాశాలు చిక్కాయా? ముందస్తు అభ్యర్థుల ప్రకటన BRS పార్టీకి లాభమా? కాంగ్రెస్ పార్టీకి లాభమా?

అభ్యర్థుల ప్రకటన ఎవరికి లాభం చేకూర్చింది?
అభ్యర్థుల ప్రకటనతో కెసిఆర్ గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?
సిట్టింగులకే సీట్లు కేటాయించడంతో అభ్యర్థులపై వ్యతిరేకత ఎంతవరకు ఉంది?
తెలంగాణ ఇంటేషన్ సర్వే ఏం చెప్తుంది ..

తెలంగాణ ఇంటేషన్ సర్వే ఆగస్ట్ 27 రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికి BRS పార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. 37 శాతం మంది ఇప్పటికి BRS పార్టీ వైపు ఉండగా, కాంగ్రెస్ పార్టీవైపు 29 శాతం, బీజేపీ వైపు 11.4 శాతం వైపు మొగ్గుచూపుతుండగా, రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని హంగ్ వస్తుందని 6.2 శాతం, ఎవరు గెలుస్తామో చెప్పలేమని 8.5 శాతం తెలుపగా పక్క BRS పార్టీ రాదని, 7.7 శాతం మంది తమ అభిప్రాయాలను తెలిపారు.

సర్వే ప్రకారం .. కెసిఆర్ నాయకత్వం, కెసిఆర్ పనితీరుపై 38.2 శాతం మంది సంతృప్తిగా ఉండగా .. 51.2% శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు,
ఇక ఎమ్మెల్యేల పనితీరుపై 31.7 శాతం మంది సంతృప్తిగా ఉండగా .. 54.98 శాతం అసంతృప్తిగా వ్యతిరేకంగా ఉన్నారు.

తెలంగాణ ఇంటెన్షన్ సర్వే ప్రకారం ..
కెసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత కంటే ఎమ్మెల్యే మీద 4 పాయింట్స్ ఎక్కువ వ్యతిరేకత ఉండగా ..
కెసిఆర్ మీద ఉన్న నమ్మకం కంటే ఎమ్మెల్యేల మీద 7 పాయింట్స్ నమ్మకం తక్కువుగా ఉంది.

కెసిఆర్ మీద, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎలా ఉన్న ..
ఇప్పటికిని BRS పార్టీకి .. కాంగ్రెస్ పార్టీకి మధ్య 7.8% ఓట్ల తేడా స్పష్టంగా ఉంది.
సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే BRS పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *