జమిలి ఎన్నికలు వస్తే తెలంగాణలో ఆ పార్టీ సత్తా చాటడం ఖాయం..

జమిలి ఎన్నికలు వస్తే తెలంగాణలో ఆ పార్టీ సత్తా చాటడం ఖాయం..

జమిలి .. జమిలి .. జమిలి ..
ఇప్పుడు రాష్ట్రంలో వినిపిస్తుంది జమిలి ఎన్నికల టాపికే ..
ఓకే దేశం – ఓకే ఎన్నికలు .. కాన్సెప్ట్ తో దేశం మొత్తానికి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చూస్తుంది ..
సాధ్యాసాధ్యాల పై కమిటీని వేసింది ..
కమిటీ రిపోర్ట్ ఎం తెలుస్తుందని అంశం పక్కన పెడితే ..
అసలు జమిలి ఎన్నికలు వస్తే తెలంగాణాలో ఏ పార్టీకి నష్టం .. ఏ పార్టీకి లాభం ..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏపార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుంది ..
జమిలితో ఎన్నికలు ఆలస్యం అయితే ఓటర్లు తమ ఓటింగ్ అభిప్రాయాలను మార్చుకొనే ఛాన్స్ ఉందా?
ఇదే అంశం పై .. తెలంగాణ ఇంటెన్షన్స్ సంస్థ విడుదల చేసిన ఇంట్రెస్టింగ్ సర్వే రిపోర్ట్ ఏంటో చూద్దాం ..

జమిలి ఎన్నికలు జరిగితే ..
61 శాతం మంది ఒటర్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందని, 26 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటును అసెంబ్లీ, పార్లమెంట్ కు వేరు వేరుగా వేసే అవకాశం ఉందని సర్వే తేల్చింది.
13 శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటు వేసేది అప్పుడే చెప్పలేమంది.

జమిలి వస్తే అసెంబ్లీ ఓట్ల షేర్ లలో ..
BRS పార్టీకి 35 శాతం
కాంగ్రెస్ పార్టీకి 30 శాతం
బీజేపీ పార్టీకి 13 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని,
చెప్పలేం అనే వారు13 శాతం ఉంటారని రిపోర్ట్ ఇచ్చింది ..

పార్లమెంట్ ఓటు షేర్ ..
BRS పార్టీకి 37 శాతం
కాంగ్రెస్ పార్టీకి 32 శాతం
బీజేపీ పార్టీకి 17 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని,
చెప్పలేం అనే వారు 9 శాతం ఉండే ఛాన్స్ ఉందని తేల్చింది ..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ..
BRS పార్టీకి 38 శాతం
కాంగ్రెస్ పార్టీకి 29 శాతం
బీజేపీ పార్టీకి 9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, కెసిఆర్ కె మెజారిటీ ఓటింగ్ ఉందని సర్వే తేల్చి చెప్పింది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *