ఆసియా కప్ కి టీమిండియా ఇదే.. తెలుగు కుర్రాడు వచ్చాడు..

ఆసియా కప్ కి టీమిండియా ఇదే.. తెలుగు కుర్రాడు వచ్చాడు..

న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2023 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ తిరిగి భారత జట్టులోకి వచ్చారు. ఎప్పటిలాగే రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. పలు గాయాల కారణంగా చాలా కాలంగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి భారత జట్టులోకి రావడంతో టీమిండియా బలంగానే కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చారు.

తిలక్ వర్మ వచ్చాడు.. 
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత కొద్ది రోజులుగా అటు ఐపీఎల్ ఇటు టీమిండియాలో నిలకడగా రాణిస్తున్న ఆటగాడిగా తిలక్ వర్మ పెరుపొందాడు. దీంతో తిలక్ ఎంపిక సరైనదిగానే విశ్లేషకులు చెబుతున్నారు.  2019 వన్డే ప్రపంచకప్ మాదిరిగానే ఈసారి టోర్నీకి కూడా భారత జట్టు నాలుగో ర్యాంక్ సమస్య ఎదురైంది. అయితే, శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా ఫిట్‌గా జట్టులోకి రావడంతో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. శ్రేయాస్ అయ్యర్ గత కొన్నేళ్లుగా భారత జట్టు తరఫున నాలుగో స్థానంలో ఆడాడు. అతను 20 ఇన్నింగ్స్‌ల్లో 47.35 సగటుతో 805 పరుగులు చేశాడు. గత ఫిబ్రవరిలో వెన్నునొప్పితో బాధపడిన శ్రేయాస్ అయ్యర్ బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శస్త్రచికిత్స చేయించుకుని పునరావాసం పొందుతున్నాడు.

మిడిల్ ఆర్డర్‌కు కేఎల్ రాహుల్
2023 ఐపీఎల్ టోర్నీలో గాయపడిన కేఎల్ రాహుల్ ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. వికెట్ కీపింగ్‌తో పాటు, అతను 5వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. అతను ఐదవ స్థానంలో 56.53 సగటుతో 735 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు.

2023 ఆసియా కప్ టోర్నమెంట్ కోసం భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, పర్దిద్ కృష్ణ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *