ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఆ పార్టీయే..!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఆ పార్టీయే..!

తెలంగాణలో రాష్ట్రంలో ఎన్నికల హాడావుడి ప్రారంభమయింది. ఇక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికలు రాక ముందే తమ పార్టీని బలంగా చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి పార్టీలు. అలాగే గ్రౌండ్ స్థాయిలో ఒపీనియన్ పోల్స్ కూడా నిర్వహిస్తున్నాయి పలు సంస్థలు. ఇక తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై తెలంగాణ ఇంటెన్షన్స్ అనే సంస్థ సర్వే నిర్వహించి ప్రతివారం నివేదికను విడుదల చేస్తోంది. తాజాగా ఈ వారం నివేదికను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. ఆ నివేదికలో ఈసారి కూడా బీఆర్ఎస్‌కే పట్టం కట్టేందుకు జనాలు సిద్ధమవుతున్నట్లు తేలింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు 40.5 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని నివేదికలో వెల్లడయింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు 26.9 శాతం.. బీజేపీకి 12.8 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తేలింది. హంగ్ ఏర్పడే అవకాశం 5.2 శాతం ఉందని.. 9.3 శాతం ఏ పార్టీకి ఓట్లు పడుతాయో తెలియదని నివేదిక పేర్కొంది. అలాగే 5.3 శాతం ఓట్లు.. బీఆర్ఎస్ కాకుండా.. కాంగ్రెస్ లేదా బీజేపీకి పడే అవకాశం ఉందని నివేదికలో తేలింది.

ఇకపోతే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం 44 శాతం.. కాంగ్రెస్ గెలిచే అవకాశం 34 శాతం.. బీజేపీ గెలిచే అవకాశం 22 శాతం ఉందని నివేదికలో వెల్లడయింది. అలాగే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ 39 శాతం.. కాంగ్రెస్ 37 శాతం.. బీజేపీ 24 శాతం గెలిచే అవకాశం ఉందని తేలింది. ఇక తూర్పు తెలంగాణలో బీఆర్ఎస్ 41 శాతం.. కాంగ్రెస్ 49 శాతం.. బీజేపీ 10 శాతం గెలిచే అవకాశం ఉందని.. పశ్చిమ తెలంగాణలో బీఆర్ఎస్ 42.. కాంగ్రెస్ 35 శాతం.. బీజేపీ 23 శాతం గెలిచే అవకాశం ఉందని వెల్లడయింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం 43 శాతం.. కాంగ్రెస్ 24 శాతం.. బీజేపీ 33 శాతం గెలిచే అవకాశం ఉందని తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వే నివేదికలో వెల్లడయింది.

పోయిన వారం నివేదికతో పోలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం 0.5 శాతం పెరిగింది. అదే సమయంలో బీజేపీ గెలిచే అవకాశాన్ని 2 శాతం.. కాంగ్రెస్ 0.7 శాతం కోల్పోయింది. ఇక నివేదిక ప్రకారం బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, పశ్చిమ తెలంగానతో పాటు జీహెచ్ఎస్‌ పరిధిలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్క తూర్పు తెలంగాణలో ముందంజలో ఉంది. అలాగే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్‌కు అతి దగ్గర్లో ఉంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌కు 37 శాతం ఓట్లు పడే అవకాశం ఉండగా.. బీఆర్ఎస్‌కు 2 శాతం అధికంగా 39 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ నివేదికను పరిశీలిస్తే ఈసారి తెలంగాణలో ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ నెలకొననున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్దిరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్.. తమ ఉనికిని చాటుకోవాలని బీజేపీ.. సీఎం కుర్చీ దక్కించుకోవాలని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో అధికార పక్ష, ప్రతిపక్ష నేతలు విమర్శలకు, ప్రతివిమర్శలు.. సవాళ్లకు ప్రతిసవాళ్లు చేసుకుంటూ హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను రెడీ చేసుకుంటున్నాయి. వారం రోజుల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించే ఛాన్స్ కనబడుతోంది. మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. కానీ పార్టీలో అంతర్గత సమస్యల కారణంగా బీజేపీ వెనకబడింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు పలువురు కీలక నేతల అండ లభించడంతో అనూహ్యంగా పోరులో ముందుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పోరు సాగుతోంది. పలు సర్వేల్లో కూడా ఈ విషయం స్పష్టంగా వెల్లడయింది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *