వాలంటీర్లపై కామెంట్స్.. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కి అడ్డంకిగా మారబోతున్నాయా..?
పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఇటీవల ఆయన వాలంటీర్లపై చేసిన కామెంట్స్ కి ఈ దావా కేసు నమోదైంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీకి ఈ కేసు ఏమైన అడ్డంకిగా నిలిచే అవకాశముందా అనే చర్చ జనసేనికుల్లో నెలకొంది. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ కేసు కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే.. రాహుల్ గాంధీ 2019 ఎన్నికల సందర్భంగా కోలార్ లో చేసిన కామెంట్స్ కి గాను ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. మోడీ ఇంటీ పేరును ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ చేయడంపై కేసు నమోదైంది. రాహుల్ గాంధీ హై కోర్టు వెళ్లినప్పటికి రిలీఫ్ దొరకలేదు. ఇప్పుడు ఆ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. సుప్రీం కోర్టు కూడా ఈ కేసు నుంచి రిలీఫ్ ఇవ్వకుంటే ఖచ్చితంగా 2024 లో రాహుల్ గాంధీ పోటీకి కూడా అనర్హుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పుడు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు కూడా వర్తిస్తే ఎలా అని జనసైనికులు పవన్ అభిమానులు కంగారుపడుతున్నారు. ప్రస్థుతం ఉన్న పరిస్థితిల్లో పవన్ జనసేన పార్టీ ఏపీలో మంచి ఊపుమీదుంది. వారాహీ యాత్రంతో అటెన్షన్ మొత్తం పవన్ కామెంట్స్, ఆయన పర్యటనల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ తరుణంలో పవన్ కి గనుక ఈ కేసులో శిక్ష పడితే ఏ న్యాయ స్థానం రిలీఫ్ ఇవ్వకపోతే ఆయన 2024 ఎన్నికలకు అనర్హుడవుతాడా అనే ప్రశ్న అందరిలోను మొదులుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిందే ఏంటంటే రాహుల్ గాంధీ కేసు కూడా ఓ కొలిక్కి రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ సమయంలో అక్కడి కోర్టులో జడ్జీలు కూడా మారారు. నాలుగేళ్ల తర్వాత రాహుల్ కి శిక్ష పడింది. ఆయన తర్వాత సుప్రీంని కూడా ఆశ్రయించారు. ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికలలోగా తీర్పు వచ్చి పవన్ కి జైలు శిక్ష పడితే అది కూడా రెండెళ్లు పడితే……క్రిమినిల్ డెఫమేషన్ కేసులో మాక్సిమన్ పనిష్మెంట్ రెండు సంవత్సరాలు. అలాగే రిఫ్రజెంట్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం కన్విక్ట్ అయితే కేసులో రెండేళ్లు శిక్ష పడితే అనర్హుడవుతాడు. అక్కడ మ్యాక్సిమమ్ శిక్ష పడితేనే ఎన్నికల్లో అనర్హుడవుతారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా శిక్ష పడటమే ఒక విషయం అయితే శిక్ష పడిన అది మ్యాక్సిమమ్ పనిష్మెంట్ రెండేళ్లు పడాలి. అది కూడా 2024 ఎన్నికల లోపు పడాలి. కాబట్టి ఇది ఇప్పట్లో జరిగే విషయం కాదు. అందులో కూడా ఏదైన న్యాయస్థానం పవన్ కు రిలీఫ్ ఇస్తే అసలు విషయమే క్లోజ్ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.