IND vs AUS ODI: ఆసీస్ వన్డే సిరీస్ నుండి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్? సంజు శాంసన్‌కి అవకాశం?
ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధం కావాలి. మూడు వన్డేల సిరీస్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ వన్డే సిరీస్ కంటే ముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ వెన్నులో గాయమైంది. మూడో రోజు ఆటలో వెన్నునొప్పి గురించి శ్రేయాస్ అయ్యర్ జట్టు మేనేజ్మెంట్కు తెలియజేశాడు. వెంటనే స్కానింగ్‌కు పంపించారు. అయితే స్కానింగ్ రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రతపై ఎలాంటి సమాచారం లేదు. వెన్ను నొప్పి కారణంగా శ్రేయాస్ అయ్యర్ కూడా తొలి టెస్టుకు దూరమయ్యాడు. బెంగళూరులో ఎన్ సీఏ నిర్వహించిన పునరావాస శిబిరంలో పాల్గొని ఫిట్ నెస్ సాధించి మళ్లీ జట్టులో చేరాడు. అయితే మూడు వారాల్లోనే శ్రేయాస్ అయ్యర్ మళ్లీ అదే గాయానికి గురయ్యాడు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం తీవ్రంగా ఉంటే, మొత్తం IPL 2023 సీజన్‌ను కోల్పోయే అవకాశం ఉంది.
శ్రేయాస్ అయ్యర్ గాయం సంజూ శాంసన్‌కు వరంగా మారే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరమైతే, అతని స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ కూడా గాయపడ్డాడు. ఆ తర్వాత మళ్లీ టీమ్ ఇండియా తరఫున రంగంలోకి దిగలేదు. ఒకవేళ శ్రేయాస్ వాకౌట్ అయితే అతని స్థానంలో సంజూ శాంసన్ వచ్చే అవకాశం ఉంది. అయితే సంజూ శాంసన్‌తో పాటు దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్ కూడా రేసులో ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ తప్పుకుంటే ఈ నలుగురికి టీమ్ ఇండియాలో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే సంజూ శాంసన్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.