రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు!

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు!

హైదరాబాద్‌: రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉరుములుమెరుపులతో వానలు, ఈదురుగాలులు వీస్తాయంది. రాష్ట్రంవైపు తూర్పు, ఆగ్నేయదిశల నుంచి గాలులువీస్తున్నాయని, వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్న సూచించారు.

* 15వ తేదీ మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయి.

* 16వ మధ్యాహ్నం నుంచి నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉంది.

* 17వ తేదీన నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల గాలి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *