మెస్సీ మెరిసాడు.. రొనాల్డో కళ చెదిరింది.. 

మెస్సీ మెరిసాడు.. రొనాల్డో కళ చెదిరింది.. 

 

క్రిస్టియానో రొనాల్డో, లియెనల్ మెస్సీ ఈ ఇద్దరి ప్రస్థుత ఫుట్ బాల్ లో గొప్ప ఆటగాళ్లు అందులో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు ఆల్ టైమ్ గ్రేట్ లిస్ట్ లో కూడా మెస్సీ, రొనాల్డో చోటు సంపాదించుకుంటారు. స్కిల్ పరంగా చూసుకున్నట్లయితే మెస్సీ గిఫ్టేడ్.. కాని రొనాల్డో ని మెస్సీని తో ఇక్వల్ గా నిలబెట్టే ఫ్యాక్టర్ రొనాల్డో ఈజ్ ఏ బిగ్ మ్యాచ్ ప్లేయర్. దేశానికి ఆడమంటే రోనాల్డో జయ్ మనిలేస్తాడు. అట్లుంటది మనోడితోని. నైన్టీస్ లో సచిన్ ఇండియా క్రికెట్ టీమ్ ఏ లెవల్ లో క్యారీ చేసుకుంటూ వచ్చాడో ఇప్పుడు రొనాల్డో కూడా గత పతి సంవత్సరాలుగా పోర్చుగల్ ని ఫుట్ బాల్ టీమ్ ని నడిపిస్తున్నాడు. పోర్చుగల్ లాంటి ఒక సాధారణ టీమ్ తో కూడా వల్డ్ కప్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న యూరో కప్ ను గెలిపించడంలో రొనాల్డో పాత్ర వెలకట్టలేనిది. 2016 లో యూరోకప్ కొట్టడంలో రొనాల్డో పాత్ర మరువలేనిది. అంతే కాదు రీసెంట్ గా నెషన్స్ లీగ్ గెలిచి పోర్చుగల్ టీమ్ ను గెలిపించాడు. అంతే కాదు రోనాల్డో తను ఆడిన మొదటి వల్డ్ కప్ లోనే పోర్చుగల్ ని సెమీస్ వరకు తీసుకెళ్లిన ఘనత అతడిది. అందుకే గత పదిహేనెళ్లుగా పోర్చుగల్ వల్డ్ కప్ లో ఆడుతుందంటే అది రోనాల్డో పర్శనల్ క్యాంపుగా చూసేవాళ్లు..కాని మొదటి సారి ఈ వల్డ్ కప్ లో కంప్లీట్ టీమ్ క్యాంపెన్ లాగా చూస్తు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడున్నది పోర్చుగల్ గోల్డెన్ జనరేషన్ దాంతో పాటు రొనాల్డో తన కెరియర్ ఎండింగ్ లో ఉన్నాడు. 2011 క్రికెట్ వల్డ్ కప్ సమయానికి టీమిండియాలో సచిన్ ఎలాగూ ఉన్నాడో ఇప్పుడు కూడా రొనాల్డో ఉన్న స్థానం అన్నమాట. పోర్చుగల్ టీమ్ కి కూడా వల్డ్ కప్ గెలవడానికి ఇంతకమన్న మంచి ఛాన్స్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు అనుకుంటున్న తరుణంలో.. పోర్చుగల్ క్వార్టల్ ఫైనల్ లోనే ఇంటి దారి పట్టింది. ఈ సారి పోర్చుగల్ కప్ కొట్టి రొనాల్డోకి మరిచిపోలేని గిఫ్ట్ ఇస్తుందని ఎంతో ఆశతో ఉణ్న అతని ఫ్యాన్స్ ఆశలు నిరాశలయ్యాయి. అయితే పోర్చుగల్ కప్ కొట్టాలంటే రొనాల్డొ కూడా తన బెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అందరు అనుకున్నారు. ఆ అంచనాలను కూడా రొనాల్డో అందుకున్నాడు. అయితే కోచ్ నిర్ణయంతో వల్డ్ కప్ కొట్టాలన్న రొనాల్డో కి నిరాశే మిగిలింది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *