Rocketry: నీ ఉద్దేశ్యం, ఆశయం మంచిదయితే అదే నిన్ను నడిపిస్తుంది..
Rocketry:The Nambi Effect మూవీ రివ్యూ..
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది. నంబి నారాయణ్ అనే ఓ సైటిస్ట్ 1980-90 లలో అమెరికా, రష్యాలకు ధీటుగా మనదేశాన్ని కూడా స్పేస్ మార్కెట్లో నిలపాలని ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి. దాంట్లో భాగంగా యూరప్ లో ఓ ప్రయోగం చేస్తున్న సమయం అది. ఆ ప్రయోగం కోసమే ఇండియా నుంచి ప్రత్యేకంగా వచ్చిన వ్యక్తి పేరు ఉన్ను. ఉన్నుకు సంబంధించి ఓ ఫోన్ కాల్ నంబి నారాయణ్ మాట్లాడతాడు. అతడు ఖచ్చితంగా ఇండియా రావాలని ఆ ఫోన్ కాల్ సారాంశం. కాని అతడు వెళ్లే లోపు జరగాల్సింది..జరిగిపోతుంది. కాని అతడు వెళ్లడం వల్ల ఆ ప్రయోగం ఆగిపోతుంది. మళ్లీ 20 యేళ్లకు గాని ఆ అవకాశం రాదు. అందుకే ప్రయోగం సక్సెస్ అయ్యేత వరకు ఉన్ను డిస్టబ్ అవ్వకూడదని నంబి అసలు విషయాన్ని దాచిపెడతాడు. ఆ తరువాత ఉన్నుకి విషయం తెలిసి నంబిని అసహ్యించుకుంటాడు. దేశం కోసం ఇలా చేయాల్సి వచ్చిందని నంబి వివరణ ఇచ్చుకున్నప్పటికీ..జీవితంలో నిన్ను క్షమించను అని వెళ్లిపోతాడు ఉన్ను. నంబి ఆ తరువాత కూడా దేశం కోసం ఎంతో కమిటెడ్ గా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేస్తాడు. అయితే దేశం కోసం ఎంతో సేవ చేసిన నంబిపై దేశ ద్రోహి అని ముద్ర వేసి జైల్లో వేస్తారు. దేశం మొత్తం నంబిపై నిందలు వేస్తుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా జైళ్లోకి వచ్చి నంబిని చూసింది లేదు. ఆ సమయంలో నంబిని వచ్చి పలుకరించిన ఒకే ఒక వ్యక్తి ఉన్ను. ఒకానొక సమయంలో నంబి నాశనమవ్వాలని కోరుకున్న ఏకైక వ్యక్తి ఉన్ను.. ఇప్పుడు నంబిని చూడటానికి వచ్చిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఎందుకంటే నంబి దేశం కోసం ఏం చేయడానికైనా వెనకాడని ఓ గొప్ప దేశభక్తుడని ఉన్నుకు బాగా తెలుసు. అందుకే యావత్ దేశం మొత్తం నంబి దేశద్రోహి అని ముద్రించిన.. ఉన్ను నమ్మలేదు. తన విషయంలో నంబి అలా ప్రవర్తించడానికి ప్రధానం కారణం దేశం మీద ఉన్న ప్రేమ. అందుకే నంబి ఎలాంటి తప్పు చేసుండడు.. ఇందులో ఏదో కుట్ర ఉందని నంబిని బెయిల్ పై జైలు నుంచి బయటకు తీసుకురావడం. ఆ తరువాత కూడా నంబి దేశం కోసం చేసిన ఎన్నో ప్రయోగాల్లో ఉన్ను వెన్నముకగా నిలుస్తాడు. ఇక ఆ తర్వాత 2014లో నంబి నారాయణ్ నిర్ధోషి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం. 2020 లో నంబి కి దేశ అత్యున్నత మూడో పురష్కార్ పద్మ భూషన్ వరించింది.
నీ ఉద్దేశ్యం, ఆశయం మంచిదయితే ఒకరు తాత్కాలికంగా నిన్ను తప్పుపట్టిన, ఆ తరువాత దేశం మొత్తం అపార్థం చేసుకున్న అదే నిన్ను కాపాడుతుంది. ఇదే రాకెట్రీలో బాగా ఆకట్టుకున్న అంశం.