ravi basrur Birth day: KGF సంగీత దర్శకుడి హిట్ పాటలు ఇవే..
KGF సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇప్పుడు అన్ని చోట్లా ఫేమస్. కన్నడలోనే కాకుండా ఇతర భాషల చిత్ర బృందాలు కూడా ఇప్పుడీ కన్నడ సంగీత దర్శకుడి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. మెహబూబా, చందా చందనాన్ హెండ్తీతో వంటి సూపర్ హిట్ సాంగ్ అందించిన రవి బస్రూర్ పుట్టినరోజు నేడు. దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలుకొట్టిన కేజీఎఫ్ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన రవి బస్రూర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితం గురించి తెలుసుకుందాము. ఈరోజు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రవి బసూర్ ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే పని చేయడం మొదలుపెట్టారు. రవి చిన్నతనంలోనే కుటుంబం విడిపోవడాన్ని చూశాడు.
14 సంవత్సరాల వయస్సులో పనిచేయడం ప్రారంభించిన రవి బస్రూర్..
అప్పటి వరకు మేనమామ ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్న సోదరుడిని అందులోంచి తొలగించడంతో.. అతని స్థానంలో రవి పనిచేయడం ప్రారంభించాడు. రవి తన 14 సంవత్సరాల వయస్సులో తన కుటుంబాన్ని పోషించడం ప్రారంభించాడు. అంతే కాదు చాలా చిన్న వయస్సులోనే తన సొంత ఆర్కెస్ట్రాను ప్రారంభించాడు. ఆ తర్వాత రెండేళ్లపాటు భక్తిగీతాలను ప్రదర్శించాడు. సంగీతం పట్ల ఆయనకున్న మక్కువ, స్ఫూర్తి రోజురోజుకూ పెరిగింది. 17 ఏళ్ల వయసులో తన కలలను మోస్తూ గ్రామాన్ని విడిచిపెట్టాడు. రవి బసూర్ తన సొదరుల అండతో కూడా కొన్నాళ్లు నెట్టికొచ్చాడు. అతను ప్రయాణం మరియు సంగీత సంబంధిత కార్యకలాపాల కోసం డబ్బు పంపేవారు అతని సోదరులు. రవి మొదట్లో భక్తిగీతాన్ని రికార్డ్ చేశాడు. అయితే సీడీని విడుదల చేసేందుకు అప్పుడు వారి వద్ద డబ్బులు కూడా లేవు. అతను డబ్బు కోసం తన ఏకైక కీబోర్డును విక్రయించాడు.అతను అప్పుడుప్పుడు సోలమన్‌ను కలిసి.. సంగీత పరిశ్రమలో సాంకేతిక పరిణామాల గురించి తెలుసుకునేవాడు. మొత్తానికి రవి బసూర్ తను దాచుకున్న మొత్తం డబ్బులతో కంప్యూటర్ కొనుగోలు చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే రవికి తాను ఎదుగుతున్న రోజుల్లు ఓ పరీక్షలా నిలిచాయనే చెప్పవచ్చు. అన్ని కష్టాలు దాటుకుని తర్వాత కన్నడ సినిమా పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాడు. ఇప్పుడు ఆయన పాటలు అందరికీ ఇష్టమైనవే.
మహబూబా పాట
KGF చాప్టర్ 2 చిత్రంలోని మెహబూబా పాట అందరికి ఇష్టమైనది. శ్రీనిధి శెట్టి మరియు రాకింగ్ స్టార్ యష్ మధ్య ఈ రొమాంటిక్ ట్రావెల్ సాంగ్ సౌత్ నుండి నార్త్ వరకు ప్రతి ఒక్కరికీ నచ్చింది. ఈ పాటను అనన్య భట్ పాడారు.
ఉగ్రం పాట
శ్రీమురళి కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉగ్రం సినిమాలోని పాట విపరీతంగా హిట్ అయింది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.