షారూఖ్ ఖాన్: మాకు ఆస్కార్ ని తాకే అవకాశం ఇవ్వండి..!
‘RRR’ టీమ్ పట్టిందల్లా బంగారంగా మారుతొంది. కొద్ది రోజుల క్రితమే ఉత్తమ చిత్రంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డును గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్ ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. అమెరిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బృందం నాటు నాటు.. అనే పాటకు గాను అవార్డు గెలుచుకుంది.
‘RRR’ సినిమా కూడా ఆస్కార్‌కి నామినేట్ అయిందని, ఈసారి అవార్డ్ ఖాయమని అంటున్నారు. ఇదే విషయంపై బాలీవుడ్ కింగ్ ఖాన్ స్పందిస్తూ.. మీ ఆస్కార్ అవార్డును తాకేందుకు మమ్మల్ని అనుమతించమని ‘RRR’ టీమ్‌ని కోరాడు. దీనికి రామ్ చరణ్ కూడా ఓకే చెప్పాడు. 2 రోజుల క్రితమే షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘పఠాన్’ ట్రైలర్ విడుదలైంది. ఇది పాన్ ఇండియా చిత్రం కాగా ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగులో రామ్ చరణ్ విడుదల చేశారు. తన సినిమా ట్రైలర్‌ను విడుదల చేసినందుకు రామ్ చరణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ షారుఖ్ ఖాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
‘‘టీజర్‌ని విడుదల చేసిన రామ్‌చరణ్‌కి ధన్యవాదాలు, మీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఇండియాకు ఆస్కార్ అవార్డును తీసుకొచ్చినప్పుడు, దయచేసి దాన్ని తాకనివ్వండి, లవ్‌యూ’’ అని అభ్యర్థించాడు. షారుక్ ఇంగ్లీషులోనే కాకుండా తెలుగులో కూడా అదే రాసి పోస్ట్ చేశాడు. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘అఫ్ కోర్స్ షారుక్ సార్, ఆ అవార్డు ఇండియన్ సినిమాకే చెందుతుంది’ అని లవ్ ఎమోజీతో స్పందించాడు. ఈ ట్వీట్‌పై పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
జనవరి 25న ప్రేక్షకుల ముందుకు ‘పఠాన్’
జనవరి 25న ‘పఠాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలైన ఈ సినిమాలో బేషరమ్ రంగ్ అనే పాటలో…దీపిక డీప్ స్విమ్మింగ్ సూట్‌లో మెరిసింది. ఈ పాట వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో దీపిక.. కాషాయ బికినీ ధరించి.. బేషరమ్ రాంగ్ అంటూ ఆలపిస్తూ రంగును అవమానించిందని హిందూ మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను బహిష్కరిస్తామంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ‘పఠాన్’ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి మొత్తం 13 కట్స్ వేశారు. బేషరమ్ రంగ్ పాటపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పలేదు. కానీ పాటలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. పఠాన్‌ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలకు విశాల్ శేఖర్ సంగీతం అందించారు. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం, అశుతోష్ రాణా, డింపుల్ కపాడియా తదితరులు నటించారు.