ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డ్​..

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డ్​..

తెలుగు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. అగ్ర కథానాయకుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ‘RRR’ బృందాన్ని ప్రశంసిస్తున్నారు

‘RRR’ ప్రధాని మోదీ అభినందనలు
95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ‘నాటు నాటు’ పాపులారిటీ ప్రపంచవ్యాప్తమైందని చెప్పారు. చరిత్రలో మరుపురాని పాటగా ఇది నిలిచిపోతుందని కితాబిచ్చారు. కీరవాణి, చంద్రబోస్​తో పాటు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు అందుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందాన్ని మోదీ అభినందించారు.

తండ్రిగా గర్వపడుతున్నా : చిరంజీవి
‘RRR’ లోని నాటు నాటుకు ఆస్కార్ రావడం పట్ల అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చరణ్ కూడా ఇందులో భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ను ఆస్కార్​కు తీసుకెళ్లేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కాలన్నారు.

భారతీయ సినిమా మరో స్థాయికి చేరింది : పవన్​ కల్యాణ్
భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకులు ఎం. ఎం. కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *