సూర్య టెస్ట్ క్రికెట్‌ ఆడే సమయం ఆసన్నమైంది: గౌతమ్ గంభీర్..

సూర్య టెస్ట్ క్రికెట్‌ ఆడే సమయం ఆసన్నమైంది: గౌతమ్ గంభీర్..

అంతర్జాతీయ T20 క్రికెట్‌లో నం.1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 2023లో గొప్ప ఆరంభాన్ని పొందాడు. శ్రీలంకతో జరిగిన టీ20 క్రికెట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన సూర్య.. ఆ తర్వాత 2వ, 3వ మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌ రిగదీశాడు. రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన సూర్య.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించాడు. దీనిపై గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు.

శ్రీలంకతో జరిగిన టీ20 క్రికెట్‌ సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ను భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసించాడు. అంతే కాదు సూర్య కుమార్ యాదర్ భారత టెస్టు జట్టులో ఆడే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు.

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీ20 క్రికెట్‌లో ప్రపంచ నెం.1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా విజృంభించాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విజృంభించాడు. దీని తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌లోనూ సూర్యకుమార్‌ను ఆడించాలనే డిమాండ్ మొదలయింది. ఇదే విషయాన్ని భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు.

“సూర్య మూడు ఫార్మాట్లలో ఆడగల బ్యాట్స్‌మెన్ అని నేను అనుకుంటున్నాను. అతన్ని టెస్ట్ క్రికెట్‌ ప్లేయర్ గా ఇప్పటి వరకు పరిగణించలేదని తెలుసు..కానీ అతడికి ఖచ్చితంగా అన్ని ఫార్మాట్లలో ఆడగల సామర్థ్యం ఉంది. అతను టెస్ట్ క్రికెట్‌లో చాలా మందిని ఆశ్చర్యపరుస్తాడు. సూర్యను 5వ స్థానంలో ఆడిస్తే అద్భుతంగా రాణించే సత్తా ఉందని రౌండర్ రవిశాస్త్రి అన్నాడు.

ఈ చర్చలో గౌతమ్ గంభీర్ కూడా పాల్గొన్నాడు. సూర్యకుమార్‌ను టెస్టు క్రికెట్‌లో ఆడేందుకు ఇదే సరైన సమయమని తన ట్విట్టర్ రాశాడు. “ఎంత అద్భుతమైన ఆట సూర్యకుమార్. అతనిని టెస్ట్ క్రికెట్‌లో ఆడటానికి సమయం” అని గంభీర్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. శ్రీలంకతో టీ20 క్రికెట్ సిరీస్‌కు ముందు మాట్లాడిన భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. రాబోయే రోజుల్లో అన్ని రకాల క్రికెట్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా ఉంటాడని అన్నాడు.

“రాబోయే రోజుల్లో అన్ని రకాల క్రికెట్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ చాలా ముఖ్యమైన ఆటగాడు కాబోతున్నాడు. మ్యాచ్ లెక్కలను మార్చగల ఆట అతనిలో ఉంది. కెప్టెన్ మరియు సెలెక్టర్లు ఖచ్చితంగా దీనిపై శ్రద్ధ వహిస్తాని హార్దిక్ం పాండ్యా అన్నాడు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *