ICC: పాక్ పై విరాట్ కొట్టిన సిక్స్ ఆల్ టైమ్ సింగిల్ టీ20 షాట్
2022 T20 ప్రపంచ కప్ లో టాప్ 5 గేమ్-మేంజింగ్ మూమెంట్స్‌ను ప్రకటించిన ICC అందులో పాక్ ఫేస్ బౌలర్ రవూఫ్ బౌలింగ్ కోహ్లీ కొట్టిన క్లాసిక్ సిక్స్‌ను ఈ ఫార్మాట్ లో నమోదైన గొప్ప సింగిల్ T20 షాట్‌గా అభివర్ణించింది.
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో టీ20 ప్రపంచకప్ 2022ను టీమ్ ఇండియా నిరాశగా ముగించింది. అయితే టోర్నీలో భారత్ తన ముద్రను ఎక్కువగానే వేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ పై గెలుపు టీమిండియా ఫ్యాన్స్ కు ఎప్పటికి ప్రత్యేకమే. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ప్రతి ఆటగాడు తన కెరియర్ లో ఒకసారైనా అలాంటి ఆటతో జట్టును గెలిపించాలని కలలుగనే ఇన్నింగ్స్ అది. 53 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు విరాట్ కోహ్లీ. సాధారణంగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఎప్పుడూ కూడా ఓ పద్దతి ప్రకారం సాగుతుంటుంది. మొదట్లో పరిస్థితులకు తగ్గట్లు వికెట్లు కాపాడుకుంటూ సింగిల్స్, డబుల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు చెత్త బంతులను బౌండరీలకు తరలించడం. కాని పాకిస్థాన్ పై విరాట్ క్రీజ్ లో ఉన్న సమయంలో టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో వికెట్ కాపాడుకుని హార్దిక్ పాండ్యాతో ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే పాకిస్ఘాన్ పదునైన ఫేస్ బౌలింగ్ ను ఎదుర్కొని గేర్లు మార్చాలంటే ఏ ఆటగాడికయిన కష్టంతో కూడుకున్న పని.. విరాట్ హార్దిక్ కూడా 12 ఓవర్ల వరకు బౌండరీలకు వెళ్లకుండా ఓపికగా వికెట్ కాపాడుకున్నారు.
వికెట్ కాపాడుకున్నప్పటికి స్కోరు బోర్డు నెమ్మదించింది. దీంతో హార్దిక్ బ్యాట్ ఝళిపించడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. అటు తర్వాత విరాట్ కూడా గేర్లు మార్చాడు. అడపాదడప ఫోర్లు కొడుతూ పాకిస్థాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ వస్తున్నాడు. చివరి ఎనిమిది బంతుల్లో 28 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో కోహ్లి, హారీస్ రవూఫ్ అద్భుతమైన స్పెల్ తో అప్పటికే కీలక వికెట్లు తీస్తూ పరుగులను కట్టడి చేస్తున్నాడు. ఆ ఓటర్లో కూడా పాక్ పేసర్ తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే ఇవ్వడంతో కోహ్లీపై ఒత్తిడి నెలకొంది. ఇక భారత ఓటమి లాంఛనమే అనుకున్నారంతా.. అయితే అప్పుడే జరిగింది అద్భుతం.. ఆ తర్వాత అతను రెండు వరుస సిక్సర్లు కొట్టి భారత్ ను తిరగి పోటీలో నిలిపాడు. అయితే 19 వ ఓటర్లో 5 వ బంతికి కోహ్లీ కొట్టిన సిక్స్ మాత్రం టీ20 ఫార్మాంట్ లోనే గొప్ప షాట్ గా చరిత్ర కెక్కింది. యావత్ భారతీయ క్రీడాభిమానులే కాదు ఐసీసీ కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్థావించింది. ఆల్మోస్ట్ షార్ట్ పిచ్ బంతిని విరాట్ కోహ్లీ సిక్స్ గా మలచిన తీరు నభూతో న భవిష్యత్.. చేధించాల్సిన రన్ రేట్ కొండెక్కి కూర్చున్న సమయంలో అంత ఒత్తిడిలో ఎవరైన బ్యాట్స్మెన్ అడ్డదిడ్డంగా బాదీ సిక్స్ కొట్టాలని చూస్తారు….. కాని విరాట్ ఒత్తిడిలోను తన బ్యాటింగ్ క్లాస్ ను చూపిస్తూ ఓ అద్భుతమైన సిక్స్ ను అది మ్యాచ్ క్లైమాక్స్ లో కొట్టడం తో అది టీ20 చరిత్రలో గొప్ప షాట్ గా నిలిచిపోయింది. ఐసీసీ కూడా ఆ షాట్ ను సింగిల్ ‘ఆల్ టైమ్ గ్రేట్ సింగిల్ టి20 షాట్’ అని అభివర్ణించింది. ఇక 19వ ఓవర్ ఆరవ బంతిని సైతం కోహ్లి సిక్సర్ బాదాడు. ఇది కూడా మరో గొప్ప షాట్ కోహ్లీ తన బ్యాట్ ను మంత్రదండంలా తిప్పుతూ బాల్ డైరెక్షన్ ను మారూస్తూ కొట్టిన షాట్ చూడముచ్చటగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ షాట్‌ని చూసి విస్మయం చెందారు.. ఇప్పటికి ఆ సిక్స్ మదిలో మెదులుతూనే ఉంది. అయితే ఇక్కడే ఓ తంటా వచ్చిపడింది. కోహ్లీ కొట్టిన ఈ రెండు సిక్సర్లలో ఇది ఎవరికి నచ్చినది వారు ఆల్ టైమ్ గ్రేట్ షాట్ అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ బ్యాక్ టూ ఫామ్ అందుకున్న తర్వాత ఓ గొప్ప ఇన్నింగ్స్ తో తనెంటో క్రీడా ప్రపంచానికి చాటుకున్నాడు.