మనుష్యులనే కాదు జంతువులను రెచ్చగొట్టవద్దు.. వాటికి కోపం వస్తుంది..

మనుష్యులనే కాదు జంతువులను రెచ్చగొట్టవద్దు.. వాటికి కోపం వస్తుంది..

ఈ సృష్టిలో ఎవరి పనివారు చేసుకుంటే మంచిది.. పక్కనోడిని గెలకకుండా నీ పని నువ్వు చూసుకో అనేది అందరికి తెలిసిన నానుడి.. కాదు కూడదని పక్కనోళ్లని గెలికితే అది మనుష్యులైన, జంతవులైన తాట తీయడం ఖాయం. అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు అదే విషయాన్ని స్ఫష్టం చేస్తోంది. జంతువులు ఆహారం కోసం అప్పుడప్పుడు అడవుల నుంచి రోడ్ల బాట పట్టడం సహజం.. అలాగే వచ్చిన ఓ ఏనుగుల గుంపు ఆగ్రహాన్ని చవిచూశారు కొంతమంది అకతాయిలు. అందరికి తెలిసిందే సెల్ఫీల మోజుతో తాము ఏం చేస్తున్నామో మరచి విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్న కుర్రకారులు.. అలా రోడ్డు మీదకు వచ్చిన ఎనుగులతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అనుకున్నదే తడవుగా సెల్ఫీలు దిగి రోడ్డుపై తచ్చాడారు. అంతటితో ఆగితే అయిపోయేది….. కాని వారిలో కొంతమందికి పురుగు మెసిలి.. ఏయ్ ఏయ్ అని ఏనుగులను ఉద్దేశించి అరవడం ప్రారంభించారు. అంతే ఒక్కసారిగా ఏనుగుల గుంపు యుద్ధభేరికి బయలు దేరినట్లు ఒక్క ఉదుటున వారి వైపుకు దూసుకొచ్చాయి. దెబ్బకు హడలెత్తిన వారు పరుగులు తీయడం ప్రారంభించారు. ఇవి గమనించిన ఏనుగులు సర్ సర్లే అనుకుని కుర్రకుంకలు ఇంకోసారి వెదవ వేషాలు వేయకండి బతికి బట్టకట్టండి అన్నట్లు తొండాన్ని చూపిస్తూ వెళ్లండిక అన్నట్లు చూశాయి. దీంతో వాళ్లందరూ బతుకు జీవుడా..అనుకొని ఇంకోసారి ఇలాంటి తింగరి వేషాలు వేయకూడదన్నట్లు అక్కడి నుంచి తుర్రుమన్నారు. అందుకే మనుష్యులకే కాదు జంతువులను రెచ్చగొట్టవద్దని అలా చేస్తే ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే మనుష్యుల తమ పంతం నెగ్గించుకుంటారు కాని జంతువులు మాత్రం క్షమించగలవు అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోని ఐఏఎస్ అధికారిని సుప్రియా సాహు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. జంతువులతో సెల్ఫీలు ప్రమాదకరమని చెపుతూ ఆమే ఫోస్టు చేసిన ఈ వీడియో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *