టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న పోలీసులు!

టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న పోలీసులు!

ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో కలిసి నేరం జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న పోలీసులు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి కంప్యూటర్ను నిందితుల సమక్షంలో పరిశీలించారు. ఐపీ అడ్రస్ ఎలా మార్చారని విషయాన్ని పోలీసులకు చూపించాడు నిందితుడు రాజశేఖర్ రెడ్డి. ఐపీ అడ్రస్ లు మార్చి కంప్యూటర్ లోకి ఎలా చొరబడ్డారని విషయాలను అడిగి క్లీయర్ గా తెలుసుకున్నారు పోలీసులు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్ లాగిన్ పాస్వర్డ్ లను శంకర్ లక్ష్మి డైరీలో నుంచి దొంగిలించినట్లు పోలీసులకు చెప్పాడు ప్రవీణ్. మరోవైపు డైరీలో ఎక్కడ కూడా లాగిన్ పాస్వర్డ్ రాయలేదని పోలీసులకు చెప్పింది శంకర లక్ష్మి. దీంతో రాజశేఖర్ రెడ్డి ఐపీ అడ్రస్లు మార్చి కంప్యూటర్లోకి చొరబడినట్లు గుర్తించారు పోలీసులు. ఫిబ్రవరి 27వ తేదీన ఏ ఈ పరీక్ష పేపర్ తో పాటు టౌన్ ప్లానింగ్ వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నా పత్రాలను కాపీ చేసినట్లు తెలిపాడు ప్రవీణ్. ఫిబ్రవరి 27వ తేదీ కంటే ముందు నుంచే లీకేజీ వ్యవహారం నడిపించినట్లు పోలీసులు తేల్చారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *