మాంచెస్టర్ యునైటెడ్‌కు బై బై – సౌదీ అరేబియాకు హలో చెప్పిన రొనాల్డో
దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 2022 FIFA ప్రపంచ కప్‌లో ఓడిపోయాడు. ఓటమి తర్వాత, అతను కన్నీళ్లతో మైదానం నుండి బయటకు వెళ్లాడు, ఆ వీడియో అభిమానుల హృదయాలను తాకింది. కాని అది ఇప్పుడు అయిపోయిన సంగతి. కాని ఇప్పుడు రానున్న రోజుల్లో రొనాల్డో ఏం చేయనున్నాడనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోర్చుగల్ ఫుట్‌బాల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియాలోని అల్-నాస్ క్లబ్‌లో ఆడేందుకు రెండున్నరేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు. దీంతో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌కు బై బై చెప్పాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.
ఇప్పుడు రొనాల్డో 2025 వరకు అల్-నాస్ క్లబ్‌లో ఆడటానికి అంగీకరించాడు మరియు ఒప్పందంపై సంతకం చేసినట్లు సౌదీ క్లబ్ తెలిపింది. ఈ ఒప్పందం విలువ €200 మిలియన్లకు మించి ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావల్సి ఉంది. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత రొనాల్డో మాట్లాడుతూ, “యూరోపియన్ ఫుట్‌బాల్‌లో నేను నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను సాధించాను. ఇప్పుడు ఆసియాలో నా అనుభవాన్ని పంచుకునే సమయం వచ్చింది. నా కొత్త సహచరులతో ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. క్లబ్ విజయానికి నేను సహాయం చేస్తాను, ”అని అన్నాడు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. “నన్ను కలబ్ మోసం చేసింది. డచ్ మేనేజర్ ఎరిక్ టెన్ హగ్ అంటే నాకు గౌరవం లేదు’ అని రొనాల్డో చెప్పాడు. ఈ సంఘటన తర్వాతే రొనాల్డో ఇప్పుడు అల్-నాస్ క్లబ్ ఆఫ్ సౌదీ అరేబియాలో చేరాడు. దీంతో ఒక్క సారిగి ఈ సౌదీ క్లబ్ కి విపరీతమైన్ క్రేజ్ ఏర్పడింది.