విలియమ్సన్ సెంచరీ: రికార్డు బ్రేక్

విలియమ్సన్ సెంచరీ: రికార్డు బ్రేక్

న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ 722 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సెంచరీ సాధించాడు.  చాలా గ్యాప్ తర్వాత సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. దాదాపు రెండేళ్ల పాటు సెంచరీ కోసం ఎదురుచూసిన న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్.. ఎట్టకేలకు ఆ లోటును అధిగమించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్ సెంచరీ సాధించాడు. విలియమ్సన్ చివరిసారిగా జనవరి 2021లో మూడంకెల స్కోరును దాటాడు. దాదాపు 722 రోజుల తర్వాత సెంచరీ సాధించి, చాలా కాలం తర్వాత టెస్టుల్లో సెంచరీ సాధించి ఊపిరి పీల్చుకున్నాడు. రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌పై చివరిసారిగా సెంచరీ చేసిన విలియమ్సన్ అదే జట్టుపై మరో సెంచరీ చేసి మళ్లీ ఫామ్‌లోకి రావడం గమనార్హం.

టెస్టు క్రికెట్‌లో విలియమ్సన్‌కి ఇది 25వ సెంచరీ. టెస్టు క్రికెట్‌లో ఓవరాల్‌గా 25 సెంచరీలు చేసిన 25వ క్రికెటర్‌గా విలియమ్సన్ నిలిచాడు. టెస్టుల్లో 25 సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా విలియమ్సన్ నిలిచాడు. దీంతోపాటు పాకిస్థాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై సెంచరీలతో విలియమ్సన్ నాన్ ఏషియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. విలియమ్సన్ ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ అన్ని వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 161 పరుగులు, సల్మాన్ 103 పరుగులు చేశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 440 పరుగులు చేసింది. విలియమ్సన్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక టామ్ లాథమ్ 113 పరుగులు చేసి అబ్రార్ అహ్మద్‌కు వికెట్‌ను అప్పగించాడు. ఇష్ సౌదీ, కేన్ విలియమ్సన్ క్రీజులో కొనసాగుతున్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *