100వ టెస్టులో డబుల్ సెంచరీ తో కదం తొక్కిన డేవిడ్ వార్నర్
దాదాపు మూడు సంవత్సరాల టెస్ట్ సెంచరీ కరువును తీర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. డబుల్ సెంచరీ సాధించి తన ఆకలిని తీర్చుకున్నాడు ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డెవిడ్ వార్నర్. 100వ టెస్ట్‌లో సెంచరీ చేసిన 10వ వ్యక్తి రికార్డు సృష్టించాడు. వార్నర్ తన 25వ టెస్ట్ సెంచరీ తో పాటు మూడవ టెస్ట్ డబుల్ సెంచరీ చేయడంతో క్రికెట్ లో దిగ్గజాల సరసన చేరాడు. రికీ పాంటింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ ఆస్ట్రేలియన్ అయ్యాడు, అతను తన 100వ సెంచరీలో డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు. వార్నర్ కంటే ముందు జో రూట్ తన 100వ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు. వార్నర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ తర్వాత తన 100వ ODI మరియు 100వ టెస్టు రెండింటిలోనూ సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. అంతే కాదు 8000 టెస్ట్ పరుగులను దాటిన ఎనిమిదో ఆస్ట్రేలియన్ అయ్యాడు. ఇక వార్నర్ టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇది నిలుస్తుంది. ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్ మొదటి రోజు ప్రత్యర్థిని చీల్చిచెండాడడంతో ఆటను ప్రత్యర్థి నుండి దూరం చేశాడు.