ఇద్దరి తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది: కేటీఆర్‌!

ఇద్దరి తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది: కేటీఆర్‌!

టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. గత ఎనిమిదేళ్లుగా చిత్తశుద్ధితో టీఎస్‌పీఎస్‌సీ పనిచేస్తోందని..95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టసవరణ చేశాం.నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తమ వ్యవస్థ పటిష్టంగా ఉందని..రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. ఎవరో ఇద్దరు చేసిన తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందన్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి ఇద్దరే కాదు.. ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవు అని కేటీఆర్‌ చెప్పారు. వ్యవస్థ తప్పుకాదు… కేవలం ఇద్దరు చేసిన తప్పు మాత్రమే. లక్షల మంది పిల్లలకు ఇబ్బంది కలగకూడదు అని కోరుకుంటున్నాం. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. దేశంలో ఎవరూ చేయనంత వేగంగా 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టాం. ఇలాంటి వ్యక్తుల పొరపాటు వల్ల వచ్చిన తప్పిదాలు మరోసారి రాకుండా చూస్తాం. గతంలో ఫీజు చెల్లించినందు వల్ల అభ్యర్థులెవరూ మళ్లీ కట్టాల్సిన పనిలేదు. సాధ్యమైనంత వేగంగా పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో అప్లయ్‌ చేసినవాళ్లంతా అర్హులే అని కేటీఆర్ చెప్పారు. 4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్‌ మెటీరియల్‌ ఆన్‌లైన్‌లో పెడతామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీసర్కిళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం అని నిర్ణయం తీసుకున్నారు .
రీడింగ్‌రూమ్‌లు 24 గంటలు తెరిచే ఉంటాయి.. భోజన వసతి కూడా ఉంటుంది. మెటీరియల్‌ అందించడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌తో సమీక్షించాం అని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు 155 నోటిఫికేషన్లు టీఎస్‌పీఎస్సీ ఇచ్చింది.ఏకకాలంలో 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్‌పీఎస్‌సీది అని మంత్రి కేటీఆర్ అన్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *