REVIEW: అవతార్ AVATHAR The way of water..

REVIEW: అవతార్ AVATHAR The way of water..

మానవాళి చూసిన, చూస్తున్న ఒక అద్భుతం అవతార్.. అసలు సినిమానే ఒక అద్భుతం అంటే అద్భుతానికి మించిన మహా అద్భుతం అవతార్. ఆ విషయం అవతార్ వన్ చూసినప్పుడు ప్రపంచం మొత్తం ఏకీభవించింది. అందుకే రెండో సినిమా కోసం అంచనాలకు అందని ఎదురుచూపులు నడిచాయి. ఎన్నో సంవత్సరాల ఎదురు చూపుకు ఫుల్ స్టాప్ పెడుతూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది అవతార్ ద వే ఆప్ వాటర్v (AVATHAR The way of water). ఈ అవతార్ సినిమా విశేషాలు మన సమీక్షలో తెలుసుకుందాం.

అవతార్ వన్ కి ఫర్ఫెక్ట్ కొనసాగింపు అవతార్ ద వే ఆఫ్ వాటర్. అవతార్ లో ఉన్న కొన్ని పాత్రలు కొనసాగిస్తూనే రెండో పార్ట్ లో ఆశ్చర్య కలిగించే కొన్ని కొత్త పాత్రలు సినిమాలో సందడి చేశాయి. పార్ట్ వన్ లో హీరో మనుషుల తరఫున పాండోరా గ్రహానికి వెళ్లి అక్కడున్న నావీ జాతీయులతో కలిసిపోయి ఆ ప్లేస్ నుండి వాళ్ళని ఖాళీ చేయించాలి. అది అతనికి ఇచ్చిన టాస్క్. అవతార్ రూపంలో నావీ జాతీయులతో కలిసిపోయిన జాక్.. మైత్రి ప్రేమలో పడ్డాడు.. ఆ తర్వాత మనుషులతో పోరాటం చేస్తాడు. నావి జాతిని రక్షిస్తూనే పాండోరా గ్రహాన్ని కాపాడతాడు. మనిషిగా ఉండడాన్ని వదిలేసుకుని కంప్లీట్ గా నావి తెగ వాడైపోయాడు. ఆ తర్వాత మైత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టడంతో రెండవ పార్ట్ మొదలవుతుంది. మనుషుల్ని భూమ్మీదకి పంపించేశారు. కానీ వాళ్లు మాత్రం తిరిగి రాకుండా ఉండరు కదా. ఈసారి ఇంకా ఎక్కువ శక్తితో పాండోర గ్రహంపైకి యుద్ధానికి వెళ్తారు. ఆ గ్రహాన్ని ఆక్రమించుకోవడమేగా లక్ష్యంగా మనుషులు దండయాత్రకు వెళ్తారు.. కానీ అక్కడ ఉన్నది జాక్.. వాళ్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అతన్ని ఆపడానికి రంగంలోకి దింపారు ఒక పవర్ఫుల్ మిషన్ ని, ఓ పవర్ ఫుల్ విలన్ ని. ఎవరా విలన్ అన్నది సర్ప్రైజింగ్ మేటర్. ఆపైన పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.. ఆపైన ధర్మం కోసం, న్యాయం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది జాక్. ముఖ్యంగా పండోరా గ్రహం సురక్షితంగా ఉండటం కోసం, తన కుటుంబం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళాడు జాక్. ఆ ప్లేస్ ఆ కొత్త ప్రపంచంలో కొత్త రకమైన నావి తెగ వాళ్ళు ఉన్నారు. అక్కడ కొత్త రకమైన రూల్స్ ఉన్నాయి. వారితో జాక్ ఫ్యామిలీ ఎలా కలిసిపోయింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ మేటర్. పోతే మనుషులకి తెలుసు జాక్ ఎప్పటికైనా ప్రమాదమైన వ్యక్తి అని. అతన్ని వెతికి పట్టుకొని అంతం చేయాలన్నది వారి టార్గెట్. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కచ్చితంగా యుద్ధానికి అవకాశం ఉంటుంది. ఆ యుద్ధం ఎంతటి బీభత్సానికి దారితీసింది చివరికి ఏం జరిగింది అన్నది ఈ సినిమా కాన్సెఫ్ట్.

ఒక విశ్లేషణ విషయానికి వస్తే ఇలాంటి కథతో తెలుగులో చాలా కథలు వచ్చాయి. తన ఫ్యామిలీ కోసం, తన సామ్రాజ్యం కోసం, తనను నమ్మిన ప్రజల కోసం ఊరు నీ, ఇల్లుని వదిలిపెట్టి అజ్ఞాతానికి వెళ్లడం తిరిగి మళ్లీ ప్రజల కోసం ఊరు కోసం రంగంలోకి దిగి కాపాడడం మనం రెగ్యులర్ గా చూసే ఫార్ములానే. ఇంక చెప్పాలంటే మహాభారతం రిఫరెన్స్ కూడా ఈ అవతార్ 2 లో గట్టిగా కనిపిస్తుంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్లి ఆ తర్వాత అజ్ఞాతవాసం వెళ్ళినట్టుగా ఇక్కడ మన జాక్ కూడా అరణ్యవాసానికి వెళ్లిపోతాడు. వాళ్ళని కనుక్కోవడానికి మనుషుల విశ్వ ప్రయత్నాలు చేస్తారు. విరాటపర్వం లో కూడా పాండవుల అజ్ఞాతవాసాన్ని కనుక్కోవడానికి చివరి అంకమైన గోగ్రహణం నుంచి పాండవులను బయటికి రప్పించడం కోసం కౌరవులు, విరాట రాజు ఆవులని బంధిస్తారు. ఈ సినిమాలో కూడా జాక్ కుటుంబానికి ఆశ్రయమిచ్చిన కొత్త జాతి నావీ తెగ వాళ్ళు తిమింగలాల మాదిరిగా ఉండే జంతువులను అడ్డుకుంటారు. మొత్తానికి మహాభారతంలోని విరాట పర్వం మాదిరిగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఈ సిక్వెన్స్. ఈ సినిమా కథలో ఎమోషన్ ని సమపాళ్లలో ఏర్పరచుకోవడానికి బలమైన అంశాలనే కామెరున్ ఏర్పరుచుకున్నాడు. అయితే జేమ్స్ కామెరాన్ ఎలాంటి కథను తీసుకున్నప్పటికీ కూడా తాను చెప్పే విధానంలోనే అసలు మ్యాజిక్ బయటకు వస్తుంది. జేమ్స్ కామెరూన్ ఇమాజినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆయన విజన్ కంప్లీట్ మైండ్ బ్లోయింగ్. ఒక కొత్త గ్రహం దాన్లో ఉన్న వింతలు, విశేషాలు గురించి అద్భుతంగా చెప్పిన.. మళ్లీ సెకండ్ పార్ట్ లో ఇంకేం చూపిస్తాడు అనేది ఎవరికి తోయబడలేదు.. కానీ అతడు సెకండ్ పార్ట్ లో కూడా అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో తన క్రియేటివి చూపించి ప్రేక్షకులను మైమరిపింపచేశాడు.జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన ఈ మ్యూజిక్ ని థియేటర్ కెళ్ళి చూస్తేనే పక్కాగా ఆస్వాదించవచ్చు. ఇకపోతే సినిమా నిడివి మూడు గంటలు ఉంది ఎక్కువసేపు ఉంది అని కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి.. ఈ సినిమాలో క్యారెక్టర్స్ అర్థం కాకపోవచ్చు, ఎమోషన్ తో కనెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు.. కానీ ఈ సినిమాలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. కథ ఏమోషన్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్ ని క్రియేట్ చేశారు. స్పెషల్ ఎక్స్పీరియన్స్ ని ప్లాన్ చేశారు. వండర్ఫుల్ విజువల్స్ క్రియేట్ చేసి మనందరినీ ఇన్వైట్ చేశారు. అంతలా అంత మంచి బ్యూటిఫుల్ వండర్లో మనందరినీ ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాదాపు అన్ని మూడు గంటల పైనే ఇంకొంచెం ప్రేక్షకుల్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేశారు.మొత్తానికి జేమ్స్ కామెరూన్ క్రియోట్ చేసిన అద్భుతాన్ని చూసి ఎంజాయ్ చేయండి.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *